స్వతంత్ర, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆర్టీసీ బస్ కు పెను ప్రమాదం తప్పింది. కోమర్తి సమీపంలో శ్రీకాకుళం నుండి పాతపట్నం వెళ్తున్న పల్లెవెలుగు బస్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. బోల్తా పడటంతో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. గాయపడిన వారిని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.