పాలమూరు నుండే పాదయాత్ర మొదలుపెడతానని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. పాలమూరు నుండే టిఆర్ఎస్ ఉద్యమం మొదలవుతుంది. పాలమూరు రంగారెడ్డిలో లక్ష్మీదేవిపల్లి బ్యారేజీ కోసం త్వరలో పాదయాత్ర చేస్తా. ఇష్యు బేస్డ్ పాదయాత్రలు రాష్ట్రం మొత్తం చేస్తాము. మా జెండా గద్దెలు కూలుస్తున్నారు. మా పార్టీ కోసం పనిచేస్తాం అని చాలా పొలిటికల్ కన్సల్టెన్సీలు వస్తున్నాయి. మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాక్రోచ్ పార్టీ వెనుక బీజేపీ ఉంది. బీజేపీ పైన ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవడానికి కాక్రోచ్ పార్టీ లాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ను తెరపైకి తెచ్చారేమో. పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయడం వెనుక చంద్రబాబు,రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. తెలంగాణ వాదాన్ని వీక్ చేయడానికి పవన్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్ర పెత్తనం ఉండాలని ఆంధ్రా నాయకుల ఆలోచనగా ఉంది. జర్నలిస్టులకు మా నాన్న ఇళ్ళు ఇవ్వలేదు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక బిడ్డగా నేను ఇళ్ళు ఇస్తా.. అని కవిత అన్నారు
పవన్ వెనుక చంద్రబాబు, రేవంత్ ఉన్నారు-కవిత
0
49
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


