ఢిల్లీలోని స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో హోటల్‌లో పనిచేస్తున్న కుక్ కేశవ్‌నేగిని నిర్లక్ష్యం వల్లే మంటలు అంటుకున్నాయని దర్యాప్తులో తేలింది. కుక్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కిచెన్‌లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే పేలిపోయిందని.. వెంటనే హోటల్ మెయిన్ పవర్‌ను ఆఫ్ చేసి తనని తాను రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీసినట్టు ఘటన తర్వాత కుక్ మీడియాకు వెల్లడించాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయక తలుపులు లాక్ అయిపోయాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. చాలా మంది లోపలే చిక్కుకుపోయారని తెలుస్తోంది. బాత్రూమ్ తలుపులు రాకపోవడంతో విదేశీ జంట మరణించారని పోలీసులు చెబుతున్నారు.
వంటమనిషి నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం
0
45
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


