రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైఎస్సార్ యంత్ర సేవా పథకం రెండో విడత మెగా మేళాను సీఎం జగన్ ఇవాళ ఉదయం గుంటూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రూ. 361.29 కోట్లు విలువచేసే 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతులకు ఆయన పంపిణీ చేశారు. అంతేకాకుండా 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా అందజేశారు. అనంతరం రైతులతో కలిసి కాసేపు సరదాగా ట్రాక్టర్ తోలారు.

అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే తన లక్ష్యమని. అన్నదాతలకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇందుకోసం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి చేకూరేలా యంత్రాలు అందిస్తామని జగన్ వెల్లడించారు.

Latest Articles

టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా

మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్