రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్

స్వతంత్ర, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం నాకు చేతకాదని.. ఆయనలా ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నాకు చేతకాదన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో.. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో.. జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు.

హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము గెలిచామన్న బండి.. పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తాం? అని ప్రశ్నించారు. మేము గెలుపు పరంపరం కొనసాగిస్తున్నాం.. వారు ఓటమి పరంపర సాగిస్తున్నారు. కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన పరంపర సాగుతోందని అన్నారు. మా దగ్గర సీనియర్లు బాస్ లు ఉంటే.. అదే కాంగ్రెస్ లో హోంగార్డులు ఉన్నారని ఎద్దేవా చేశారు. మీ పార్టీకి ఎందుకు క్యాండిడేట్లు దొరుకుతలేరు? అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపై( (రేవంత్ ను ఉద్దేశిస్తూ) సోషల్ మీడియాలో విమర్శలు చేయడం నాకు చేతకాదని అన్నారు. బీజేపీ పార్టీ ఎక్కడుందో వాళ్ల అయ్యను కేటీఆర్ అడగండి.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉందో, బీజేపీ ఉందో సమాధానం చెప్పారని వ్యంగ్యంగా మాట్లాడారు.

సీఎం పాలనపై విరుచుకుపడుతూ.. మాది కుటుంబ పార్టీ కాదు.. అయ్య పేరు చెప్పి కూతురు, కొడుకు సీఎంలు అయ్యే పార్టీ మాది కాదని అన్నారు. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ మాది కాదని అన్నారు. అయ్య లేకుంటే బిడ్డ, బిడ్డ లేకుంటే కొడుకు సీఎం అయ్యే పార్టీ మాది కాదంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదన్న బండి.. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలని అన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాం.. గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించామని అన్నారు. ఈ క్రెడిట్ అంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేనని వ్యాఖ్యానించారు.

 

Latest Articles

విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్