స్వతంత్ర, వెబ్ డెస్క్: వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్తిని మెడికో ప్రీతీ ఘటన మరువక ముందే మరో విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం ఖమ్మంలో మెడికో విద్యార్థిని మానస (22) ఆత్మహత్యకు పాల్పడింది. మమతా మెడికల్ కళాశాలలో బిడిఎస్ మూడో సంవత్సరం చదువుతున్న మానస… హాస్టల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని సూసైడ్ చేసుకుంది. పరిస్థితి విషమించడంతో తీవ్ర గాయాలతో మానస మృతి చెందింది. మానస స్వస్తలం వరంగల్ జిల్లా. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.