రిలీజ్ కి ముందే..రికార్డ్ క్రియేట్ చేసిన చైతూ..

అక్కినేని నాగచైతన్య.. తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సంవత్సరం దాటేసినా.. ఇంత వరుకు కొత్త సినిమా రిలీజ్ చేయలేదు. చైతూ.. కార్తీక్ దండు డైరెక్షన్లో వృషకర్మ అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఆమధ్య ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి మూవీ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చైతూ వృషకర్మ విడుదలకు ముందే.. రికార్డ్ క్రియేట్ చేసాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఆ రికార్డ్ ఏంటి..? డిఫరెంట్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న వృషకర్మ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడు..?

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ఒకటి వృషకర్మ. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం నాగ చైతన్య గత ఏడాదిన్నరగా ఎంతో అంకితభావంతో పని చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ చిత్ర నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ, శాటిలైట్ హక్కులతో పాటు అన్ని నాన్-థియేట్రికల్ హక్కులను జీ గ్రూప్ సంస్థ సుమారు 50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. నాగ చైతన్య కెరీర్‌లో ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద నాన్-థియేట్రికల్ డీల్‌గా నిలిచింది. ఇది సినిమాపై ట్రేడ్ లో ఉన్న క్రేజ్ ను తెలియచేస్తుంది.

ఇప్పటి వరుకు నాగచైతన్య కెరీర్లో రిలీజ్ కి ముందు నాన్ థియేట్రికల్ రైట్స్ కి ఇంత పెద్ద మొత్తం రాలేదు. వృషకర్మ ఈ విధంగా చైతన్య కెరీర్లో హయ్యస్ట్ నాన్ థియేట్రికల్ రైట్స్ అమౌంట్ అందించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపినీడు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. విరూపాక్ష చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కార్తీక్ దండు, మరోసారి మిస్టిక్ జానర్‌లోనే అతీంద్రియ శక్తులు, సాహస అంశాలు, థ్రిల్లర్ అంశాలను మేళవించి ఆసక్తికరమైన కథతో వృషకర్మ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ క్రేజీ మూవీని సమ్మర్ తర్వాత రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఓటీడీ డీల్ వలన లేట్ అయ్యిందని తెలిసింది. ఇప్పుడు ఓటీటీ డీల్ సెట్ అవ్వడంతో.. రిలీజ్ డేట్ పై మేకర్స్ ఫోకస్ చేసారని సమాచారం. కుదిరితే దసరాకి థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వృషకర్మ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మరి.. రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రికార్డు క్రియేట్ చేసిన వృషకర్మ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్