ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయుల సభలో మాట్లాడారు. ” ఆస్ట్రేలియాలో అద్భుతమైన ఆతిథ్యం లభించింది. మెల్‌బోర్న్ అపూర్వ స్వాగతం మరిచిపోలేను. మెల్‌బోర్న్ స్టేడియం జనంతో నిండిపోయింది. ఆస్ట్రేలియా అంటే ఎంతో గౌరవం. ఆస్ట్రేలియాలోని ఈ ప్రదర్శన బ్లాక్ బస్టర్. ఆస్ట్రేలియాకు మూడుసార్లు వచ్చి హ్యాట్రిక్ కొట్టాను. సిడ్నీలో రెండు సార్లు పర్యటించా. మెల్‌బోర్న్‌లో పర్యటించాలన్న నా కల నెరవేరింది. ఆస్ట్రేలియా భారత్‌కు ముఖ్యమైన మిత్రదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మెల్‌బోర్న్ . మెల్‌బోర్న్ ఐకానిక్ స్టేడియంగా అభివృద్ధి చెందింది. మెల్‌బోర్న్ ప్రాంతం భారతీయ సంస్కృతితో నిండి ఉంటుంది. మెల్‌బోర్న్ మినీ ఇండియాగా పిలుస్తారు. ఆస్ట్రేలియా అభివృద్దిలో ప్రవాసభారతీయులది కీలకపాత్ర. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఆదరణ పొందుతున్నారు. గ్రో మోర్, అచీవ్ మోర్ నినాదంతో ముందుకెళ్లాలి. అతిపెద్ద 5జీ మార్కెట్‌గా భారత్ మారింది. మేడిన్ ఇండియాలో భాగంగా 6జీ దిశగా పయనిస్తున్నాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా భారత్ ఉంటుంది. చంద్రయాన్ ద్వారా తొలిసారి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాం.
అంతరిక్షంలోకి గగన్‌యాన్‌ను పంపేందుకు భారత్ సిద్ధమవుతోంది”.. అని ప్రధాని అన్నారు.
మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయుల సభ.. బ్లాక్ బస్టర్
Latest Articles
- Advertisement -


