జైలులో వంశీకి థ్రెట్‌ ఉంది- వంశీ భార్య పంకజశ్రీ

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సబ్‌ జైలుకు వెళ్లి వంశీతో ములాఖత్‌ అయ్యారు. కేసును ఫ్యాబ్రికేట్‌ చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని ఆమె విమర్శించారు.

పంకజశ్రీ మాట్లాడుతూ.. వల్లభనేని వంశీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. సొంత డబ్బులతో అరుణ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. రూ.20వేల కోసం సత్యవర్థన్‌ అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టామని కేసు పెట్టారన్నారు. ఇందులో ఎంత వరకు నమ్మశక్యమో ప్రజలే చెప్పాలన్నారు. వంశీకి ప్రాణ హాని ఉందని.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని అన్నారు. 22 గంటల పాటు సెల్‌లో పెట్టేసి,.. ఎవరూ రాకుండా , ఎవరితో సంబంధం లేకుండా ఉంచుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశరు. ఆయనను సెల్‌లో పెట్టి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. వంశీపై నేరాలు రుజువుకాకుండానే పనిష్‌మెంట్‌ సెల్‌లో పెట్టి, ఎవరూ కలవకుండా, 60 సీసీ కెమెరాలు పెట్టి క్షోభ పెడుతున్నారని అన్నారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న వంశీని ఇలా వేధించడం తగదని చెప్పారు.

జైలులో టార్చర్‌ పెడుతున్నారని, నేలపై పడుకోబెడుతున్నారని వంశీ భార్య అన్నారు. సత్యవర్థన్‌ ఒప్పుకోవడం లేదు.. అందుకే వంశీని కోర్టులో ప్రవేశపెట్టడం లేదు.. వంశీపై మరిన్ని కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. జైలులో వంశీకి థ్రెట్ ఉందని పంకజశ్రీ ఆరోపించారు.

మొబైల్‌ కోసం ..

మరోవైపు ఈ కేసుల్లో ఏపీ, తెలంగాణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10వ తేదీన విజయవాడ కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత సత్యవర్థన్‌ని వంశీ అనుచరులు నేరుగా హైదరాబాద్‌ తీసుకెళ్లి ఆయన నివాసంలో వల్లభనేని వంశీతో కలిపిచ్చారు. వంశీతో పాటు మరికొందరు కలిసి సత్యవర్థన్‌ను బెదిరించారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో నివేదించారు. దీంతో హైదరాబాద్‌లోని వంశీ ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ కీలకంగా మారనుంది.

మరోవైపు కీలకమైన వల్లభనేని వంశీ మొబైల్ కోసం ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. ఫోన్‌లో ఎవరెవరిని కాంటాక్ట్‌ చేశారో.. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు సేకరణకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. వంశీ ఇంట్లో తనిఖీలు చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పోలీసులు తీసుకెళ్లినట్టు సమాచారం.

Latest Articles

దటీజ్.. మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్