స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాపై స్థానికులు తిరుగుబావుటా ఎగురవేశారు. పాతగుంటూరులోని బ్రహ్మంగారి గుడి వీధిలో మురుగు కాల్వల నిర్మాణం శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. రహదారులు చిన్నగా ఉన్నందున.. కాల్వల కంటే భూగర్భ డ్రైనేజి నిర్మిస్తే బాగుంటుందని స్థానిక కార్పొరేటర్ అశోక్‌తో కలిసి ఎమ్మెల్యేకు విన్నవించారు. అయితే వారి విజ్ఞప్తికి ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో తొమ్మిదేళ్లుగా తమ ప్రాంతంలో ప్రజలు మురుగు నీటితో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదని ఎమ్మెల్యేపై వారు మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నందున తమ ఏరియాకు వచ్చారా? అని ప్రశ్నించడంతో మీరు నాశనమైపోతారని ఎమ్మెల్యే శాపనార్థాలు పెట్టారు.
ప్రజలు నాశనమైపోతారంటూ ఎమ్మెల్యే శాపనార్థాలు
0
676
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


