మోదీ ప్రభుత్వ హయాంలో దళితులు, ఆదివాసీలు, పేదలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ సాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సా హంగా పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా కార్నర్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని విమర్శించారు. హైకోర్టుల్లో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వారు ఎంతమంది ఉన్నారో చెప్పండి? అని ప్రశ్నించారు. 650 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని వారిలో ఎందరు దళితులు, ఆదివాసీలు ఉన్నారని నిలదీశారు. జనాభాలో 73 శాతం ఉన్న దళితులు, పేదలు, వెనుకబడిన తరగతులవారికి సరైన ప్రాతి నిధ్యం లభించడంలేదన్నారు. బ్యూరోక్రాట్లలో దళితులు ఎంతమంది ఉన్నారో చెప్పండి?…అని నిలదీ శారు.
యూపీ ప్రతాప్ గఢ్ లో రాహుల్ న్యాయ్ యాత్ర
0
634
Previous article
Latest Articles
వ్యాపారవేత్త ఇంట్లో కేజీ బంగారం మాయం.. నేపాలీ పనిమనుషులపై అనుమానం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు అపహరించినట్టు సమాచారం. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు ప్రధాన...
- Advertisement -
- Advertisement -


