మోదీ ప్రభుత్వ హయాంలో దళితులు, ఆదివాసీలు, పేదలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ సాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సా హంగా పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా కార్నర్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని విమర్శించారు. హైకోర్టుల్లో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వారు ఎంతమంది ఉన్నారో చెప్పండి? అని ప్రశ్నించారు. 650 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని వారిలో ఎందరు దళితులు, ఆదివాసీలు ఉన్నారని నిలదీశారు. జనాభాలో 73 శాతం ఉన్న దళితులు, పేదలు, వెనుకబడిన తరగతులవారికి సరైన ప్రాతి నిధ్యం లభించడంలేదన్నారు. బ్యూరోక్రాట్లలో దళితులు ఎంతమంది ఉన్నారో చెప్పండి?…అని నిలదీ శారు.
యూపీ ప్రతాప్ గఢ్ లో రాహుల్ న్యాయ్ యాత్ర
0
653
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


