38.2 C
Hyderabad
Sunday, May 3, 2026
spot_img

రాకేష్ మాస్టర్ భార్యపై దాడి చేసిన మహిళలు.. కారణం ఏంటంటే..!

స్వతంత్ర వెబ్ డెస్క్:  ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసిందే. విపరీతంగా మద్యం సేవించడంతో ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. గతంలో కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేశారు రాకేష్ మాస్టర్. ప్రభాస్, రవితేజ, మహేష్ బాబు, రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు రాకేష్ మాస్టర్ అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, సత్యా మాస్టర్, జానీ మాస్టర్ కు గురువు రాకేష్ మాస్టర్. కానీ కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ.. పలు యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చేస్తున్నారు. ఆయన మరణంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా రాకేష్ మాస్టర్ మూడో భార్య పై కొందరు మహిళలు దాడి చేశారు.

రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీ అనే ఆమె పై పలువురు  మహిళలు దాడి చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ విషయం అయి గొడవ జరిగిందని తెలుస్తోంది. లక్ష్మీ పై లల్లి అనే యూట్యూబర్, నెల్లూరుకు చెందిన భారతితోపాటు మరో ముగ్గురు కలిసి హైదరాబాద్ పంజాగుట్ట లో దాడి చేశారు.

రాకేష్ మాస్టర్ కు చెందిన ఓ యూట్యూబ్ ఛానెల్ ను లక్ష్మీ లాకుందని.. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఆ ఛానెల్ ను తిరిగి తీసుకునే క్రమంలో గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తన పై జరిగిన దాడి గురించి లక్ష్మీ స్పందిస్తూ.. నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ ఇదంతా చేయిస్తుందని. తనను చంపేందుకు లక్షరూపాయిలు సుపారీ కూడా ఇచ్చిందని.. పలు మార్లు చంపేస్తా అని బెదిరిచిందని తెలిపింది.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్