పటాస్ సినిమా నుంచి మన శంకర్ వరప్రసాద్ గారు వరుకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న హిట్ మిషన్ అనిల్ రావిపూడి (anil ravipudi). లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ (venkatesh) నందమూరి కళ్యాణ్ రామ్ (kalyan ram) కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మల్టీస్టారర్ ను సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ క్రేజీ మూవీ ప్రారంభోత్సవానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంతకీ.. ఈ భారీ చిత్రం టైటిల్ ఏంటి..? రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు..?
అపజయం అనేది లేకుండా దూసుకెళుతున్న హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టేసారు. వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో రూపొందే క్రేజీ మల్టీస్టారర్ ని ప్రారంభించారు. ఇందులో వెంకీకి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంటే.. కళ్యాణ్ రామ్ కి జంటగా కృతి శెట్టి నటిస్తుంది. ఈ మూవీకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ను స్టార్ట్ చేసినట్టుగా తెలియచేస్తూ సరదాగా.. తనదైన స్టైల్ లో ఓ వీడియోను రిలీజ్ చేయడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు పూజా కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించడంతో.. ఇక నుంచి అనిల్.. ప్రమోషన్స్ మామూలుగా ఉండవు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ఇక ఈ మూవీ టైటిల్ విషయానికి.. అనిల్ రావిపూడి టైటిల్స్ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే.. జంధ్యాల, ఈవీవీ స్టైల్ లో టైటిల్స్ పెడుతుంటారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర్ వరప్రసాద్ గారు… ఇలా డిఫరెంట్ టైటిల్స్ పెట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు జనవరి 13 విడుదల అనేది టైటిల్ గా పెట్టారని ప్రచారం జరుగుతుంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఈ టైటిలే ఖరారు చేయచ్చు అనేది ఇన్ సైడ్ న్యూస్.
ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్ బావ బావమరిదిగా నటించనున్నారని సమాచారం. వెంకీ డేట్స్ ఎప్పుడు ఇస్తే.. అప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనిల్. అయితే.. వెంకీ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరుకు ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారని సమాచారం. ఆతర్వాత జులై నుంచి వెంకీ ఈ మూవీ షూట్ లో జాయిన్ అవుతారని తెలిసింది. సంక్రాంతికి ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ క్రేజీ మల్టీస్టారర్ తో.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.


