కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్త కిరణ్‌కుమార్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించి, అరెస్టు చేశారు. కేసు వివరాలను ఏఎస్పీ విభు కృష్ణ వెల్లడించారు.
పోలీసుల ప్రకారం, కిరణ్‌కుమార్ యూట్యూబ్‌లో చూసి హత్యకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విషం తెప్పించి పాలకోవాలో కలిపి భార్యకు ఇచ్చాడు.
ఇది తెలియక విషంతో ఉన్న పాలకోవా తిన్న పద్మజ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే భర్త దిండుతో ముఖంపై నొక్కి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యపై అనుమానం, వ్యక్తిగత కారణాలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.


