స్వతంత్ర వెబ్ డెస్క్: బహుజన రాజ్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3 వ తేదీన జరుపుతామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దేశంలో పేద వర్గాలు, మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా మహిళల, వితంతువుల చదువు కోసం అలుపెరగని కృషి చేసిన మొదటి తరం మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే అని, పేద వర్గాలకు చదువునందించే క్రమంలో ఎన్నో అవమానాలు, బెదిరింపులను ఫూలే దంపతులు ఎదుర్కొన్నారన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ వల్ల మెజారిటీ పేదలకు చదువు వచ్చిందని గాని, ఉపాధ్యాయుల పనీతీరు మెరుగైందని చెప్పడానికి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవని పేర్కొన్నారు.
RS Praveen Kumar: ఉపాధ్యాయ దినోత్సవ తేదీని జనవరి 3 కు మారుస్తాం..!
0
237
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


