38.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం – సీఎం రేవంత్‌

సైబర్‌ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్‌ పోలీసులు ముందంజలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సైబర్‌ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన షీల్డ్‌ 2025 సదస్సులో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. సైబర్‌ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్‌ పోలీసులు ముందంజలో ఉన్నారని చెప్పారు. గతేడాది సైబర్‌ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని… ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి.. మన సొమ్ము దొంగిలిస్తున్నారని చెప్పారు. నేరం ఎక్కడి నుంచి ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారిందన్నారు. నేరాల శైలి మారుతోందన్న సీఎం రేవంత్.. వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని చెప్పారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్