సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన షీల్డ్ 2025 సదస్సులో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని చెప్పారు. గతేడాది సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని… ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి.. మన సొమ్ము దొంగిలిస్తున్నారని చెప్పారు. నేరం ఎక్కడి నుంచి ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారిందన్నారు. నేరాల శైలి మారుతోందన్న సీఎం రేవంత్.. వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని చెప్పారు.
తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం – సీఎం రేవంత్
Latest Articles
- Advertisement -