తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీల పట్ల రేవంత్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని.. 45 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిందన్నారు. కాంగ్రెస్ పార్టీనే.. ఒక్క బీసీ, ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని… అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని ఈటల విమర్శించారు.