విజయ్ దేవరకొండ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్..?

విజయ్ దేవరకొండ.. నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే.. రణబాలి, రౌడీ జనార్థన. అయితే.. రీసెంట్ గా హాయ్ నాన్న డైరెక్టర్ తో కొత్త సినిమాని స్టార్ట్ చేశారు ఈ రౌడీ స్టార్. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసాడని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా.. ఈ క్రేజీ మూవీని ముందుగా మరో హీరోతో ప్లాన్ చేస్తే.. ఇప్పుడు విజయ్ దగ్గరకు వచ్చిందనేది ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు..? ముందు ఈ మూవీ ఏ హీరోతో ప్లాన్ చేసారు..? ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈమధ్య నటించిన సినిమాలు సరైన సక్సెస్ ఇవ్వలేదు. అందుకనే.. డిఫరెంట్ మూవీస్తో.. ఆడియన్స్ ఆకట్టుకుని సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు. రౌడీ జనార్థన, రణబాలి.. ఈ రెండు సినిమాలు ఇంత వరుకు విజయ్ ని ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా.. పవర్ ఫుల్ గా చూపించే సినిమాలు. ఈ రెండు సినిమాల్లో రణబాలి సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంటే.. రౌడీ జనార్థన డిసెంబర్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ రెండు సినిమాల పై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే.. హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందని తెలిసింది. ఇంతకీ.. ఏ డైరెక్టర్ తో అంటే.. మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో అని సమాచారం. అయితే.. ఇటీవల విజయ్ దేవరకొండ ముంబైలో మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ ఆఫీస్‌లో విక్రమ్ కే కుమార్‌తో కలిసారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది బాలీవుడ్ టచ్‌తో కూడిన ప్రాజెక్ట్ కావచ్చని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాని ముందుగా ఎవరితో చేయాలి అనుకున్నారంటే.. నితిన్ తో విక్రమ్ కుమార్ చేయాలి అనుకున్నారని తెలిసింది. నితిన్, విక్రమ్ కే కుమార్ కాంబోలో ఇష్క్ మూవీ రూపొందడం బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. వరుస ప్లాపులతో నితిన్ మార్కెట్ పడిపోవడం.. ఇది భారీ బడ్జెట్ మూవీ కావడంతో.. క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విజయ్ దగ్గర వచ్చింది. ఈ సినిమాతో విజయ్ సర్ ఫ్రైజ్ ఇవ్వబోతున్నాడని టాక్. మరి.. సరైన సక్సెస్ కోసం తపిస్తున్న విజయ్ దేవరకొండ.. రణబాలి, రౌడీ జనార్థన, విక్రమ్ తో చేసే సినిమాతో వరుసగా సక్సెస్ సాధించి ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్