సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని.. అలా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌కి ఆ మాట చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు అయినా కట్టారా… రేవంత్ చేసేది చెప్పరు.. చెప్పింది చేయరని విమర్శించారు. తాము చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారని అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పొంగులేటి వచ్చి..6 వేల ఇళ్లు ఇస్తామన్నారు.. 6 అయినా కట్టారా? అని కేటీఆర్ నిలదీశారు. దేశం మొత్తం కాంగ్రెస్‌ను వదిలించుకుంటే..తెలంగాణలో నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. సీఎం కాకముందు రైతులకు 3 గంటల కరెంట్ చాలన్నారని.. మేం 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని గుర్తు చేశారు. రైతు డిస్కం కాదు.. రైతును చంపే డిస్కం అని ఆరోపించారు. కేసీఆర్ అప్పు చేసి సంక్షేమ పథకాలు చేపట్టారని… రేవంత్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. రైతుబంధు లేదు కానీ రాహుల్ బంధు నడుస్తోందని అన్నారు కేటీఆర్.
కాంగ్రెస్‌ను దేశమంతా వదిలించుకుంటుంది- కేటీఆర్
0
50
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


