రూటు మార్చిన పుష్ప విలన్ ఫాహద్..

పుష్ప సినిమాలో.. హీరో అల్లు అర్జున్ ఎంతలా ఆకట్టుకున్నాడో.. విలన్ గా నటించిన ఫాహిద్ ఫాజిల్ కూడా అంతే.. ఆకట్టకున్నాడు. డిఫరెంట్ అండ్ సీరియస్ పోలీస్ గా ఫాహిద్ ఫాజిల్ తనదైన యాక్టింగ్ తో మెప్పించాడు. దీంతో.. తెలుగులో ఫాహిద్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఫాహిద్ రూటు మార్చి ఓ తెలుగు సినిమాలో తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రను చేస్తున్నాడు. అదే.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇంతకీ.. ఈ మూవీ ఎలా ఉండబోతుంది..?

మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అతణ్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఫాహద్ తన అద్భుతమైన నటనతో చాలా తక్కువ టైంలో ఊహించిన స్థాయికి చేరుకున్నాడు. కుంబలంగి నైట్స్, జోజి సహా అనేక చిత్రాలు తనలోని స్పెషల్ టాలెంటుని బయటపెట్టాయి. ముఖ్యంగా కొంచెం సైకో లక్షణాలున్న క్యారెక్టర్ పడితే.. చెలరేగిపోతాడు. చాలా సినిమాల్లో తన యాక్టింగ్ తో ఆడియన్స్ కే కాదు.. సినిమా జనాలకు కూడా షాక్ ఇచ్చాడు. తెలుగులో నటించిన పుష్ప, పుష్ప-2 చిత్రాల్లో అదే తరహా యాక్టింగ్ తో మెప్పించాడు.

ఫాహద్ ప్రతిసారీ ఒకే తరహా క్యారెక్టర్లు చేస్తుండడంతో ఆడియన్స్ లో మొనాటనీ వస్తుందని ఫీలవుతున్నాడో ఏమో కానీ.. రూటు మార్చి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకనే ఫాహద్ తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రను చేస్తున్నాడు. అదే.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, జక్కన్న తనయుడు కార్తికేయ కలిసి నిర్మిస్తుండడం విశేషం. శశాంక్ యేలేటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ విషయానికి వస్తే.. ఫాహద్‌ది పూర్తిగా నవ్వించే పాత్రలా ఉంది. అతను ఇందులో మెజీషియన్ పాత్ర చేస్తున్నాడు. అతడి విన్యాసాలు చూసి ఇంప్రెస్ అయి ఒక చిన్న పాప అతడికి దగ్గరవుతుంది. తర్వాత ఆ పాపే మంత్ర తంత్రాలు తెలిసిన అమ్మాయని అతడికి అర్థమవుతుంది. మొత్తానికి టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీజర్ పూర్తి వినోదాత్మకంగా సాగి.. ఒక క్రేజీ రైడ్‌ చూడబోతున్న ఫీలింగ్ అయితే కలిగించింది. సెప్టెంబరు 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా టీజర్ ద్వారా అనౌన్స్ చేశారు. మరి.. ఫాహద్ చేస్తున్న ఈ డిఫరెంట్ మూవీ ఎంత వరుకు మెప్పిస్తుందో చూడాలి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్