శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (14) , ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా అవుటవడంతో, భారత్ ‘ఎ’ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సూర్యవంశీ మహమ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో అవుటవగా, ప్రభ్‌సిమ్రన్‌ను చమిక కరుణరత్నే పెవిలియన్‌కు పంపాడు. అయితే, ప్రియాన్ష్ ఆర్య , రుతురాజ్ గైక్వాడ్ జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో ఉంది. రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ‘ఎ’ జట్టును తిరిగి గాడిలో పెడుతున్నారు. అంతకుముందు, మంగళవారం జరిగిన ట్రై-నేషన్ ‘ఎ’ సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక ‘ఎ’ జట్టుపై భారత్ ‘ఎ’ కెప్టెన్ తిలక్ వర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్యలతో కూడిన తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్ స్టార్లు అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
ట్రై నేషన్ ఏ సిరీస్ 2026: వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోయిన భారత్ ఏకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ
0
61
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


