హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు అపహరించినట్టు సమాచారం. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు.
నెల రోజుల క్రితమే వీరిని పనిలో పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేసరికి ఆ నేపాలీ దంపతులు కనిపించలేదు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారవేత్త. పోలీసులు (CCTV) సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు.
వ్యాపారవేత్త ఇంట్లో కేజీ బంగారం మాయం.. నేపాలీ పనిమనుషులపై అనుమానం
Latest Articles
- Advertisement -


