ఆర్ & బి ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. మాదాపూర్‌లో ఆర్ & బి (రోడ్లు & భవనాల శాఖ) ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసం సహా పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై తనిఖీలు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఆస్తులు, పెట్టుబడుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాడుల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం.
ఆర్ & బి ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడులు
0
9
Latest Articles
టాక్సిక్ రీ షూట్ నిజమేనా?
కన్నడ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్.. మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలోని కొంత భాగంతో యష్ సంతృప్తిగా లేరని.....
- Advertisement -
- Advertisement -


