టీ20 వరల్డ్‌కప్‌లో రేపు సెమీ ఫైనల్ పోరు

టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్‌ పోరుకు టీమిండియా సిద్దమైంది. రేపు రాత్రి 8 గంటలకు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ జట్టును ఢీకొననుంది. రేపు ఒక్కరోజే రెండు సెమీస్‌ జరగనుండగా తొలి సెమీస్‌లో ఉదయం 6గంటలకు తొలి సెమీస్‌ ప్రారంభంకానుంది. ఈ ఆటలో దక్షిణా ఫ్రికా వర్సెస్‌ ఆఫ్టానిస్తాన్‌ తలబడతాయి. అనంతరం రెండో సెమీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య సమరం సాగనుంది. టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్‌8 ఘట్టం ముగియడంతో రేపు నాలుగు జట్లు సెమీ ఫైనల్‌లో తలబడనున్నాయి.

ఇక రేపు జరిగే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. గయానాలో వర్షం పడే సూచన ఉంది. ఒకవేళ అదే జరిగితే రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా రద్దు చేయవచ్చు. దీనికి కారణం ఏమిటంటే, ఐసీసీ మొదటి సెమీ-ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డేని ఉంచింది. కానీ, రెండవ సెమీ-ఫైనల్‌కు కేవలం 4 గంటల 10 నిమిషాలు అంటే దాదాపు 250 నిమిషాల అదనపు సమయం ఇచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ వ్యవధిలో మ్యాచ్ జరగకపోతే, మ్యాచ్ రద్దు అవుతుంది. అయితే,.. మ్యాచ్‌ రద్దు అయినా కంగారుపడాల్సింది లేదు. ప్రత్యేక నిబంధనల కారణంగా టీమిండియా సులువుగా ఫైనల్ చేరుతుంది. భారత్ తన సూపర్ 8 రౌండ్ మ్యాచ్‌లలో 3 గెలిచి, 6 పాయింట్లతో గ్రూప్ 1లో మొదటి స్థానంలో నిలిచి సెమీ-ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. అదే సమయంలో ఇంగ్లండ్ 3 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీకి సంబంధించి ఐసీసీ రూపొందించిన నిబంధనల మేరకు మ్యాచ్ జరగకపోతే సూపర్ 8లో ఏ జట్టు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉంటే ఆ జట్టు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా, మ్యాచ్ జరగకపోతే, భారత్ మొదటి స్థానంలో ఉండటంతో రోహిత్ సేన ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్