Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

అంతరిక్షంలో మహోజ్వల ఘట్టం – చంద్రయాన్ త్రీ

       చంద్రయాన్ త్రీ….భారత కీర్తి పతాక. చంద్రయాన్ త్రీతో అంతరిక్ష పరిశోధనా సంస్థ …ఇస్రో సత్తా చాటింది. అంత రిక్ష పరిశోధనల్లో ఒక మహోజ్వల ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇప్పటివరకు సోవియట్ యూనియన్, అమెరికా, చైనా మాత్రమే జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాయి. ఇటీవల చంద్రయాన్ త్రీ కూడా ఈ అద్భుతమైన విజయం సాధిం చింది. చంద్రయాన్ త్రీ ప్రయోగానికి ఒక ప్రత్యేకత ఉంది. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద మొట్టమొదట దిగిన ల్యాండర్‌గా విక్రమ్ చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం అంతరిక్ష పరిశోధకుల దృష్టిలో చాలా సంక్లిష్టమైన ప్రాంతం. దక్షిణ ధ్రువం దగ్గర ల్యాండర్ దిగటం అంటే చిన్న విషయం కాదు. ఒక దశలో ఇది అసాధ్యమన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇస్రో సైంటిస్టులు, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

      ఒకవైపు దాదాపు 50 ఏళ్ల తరువాత, చందమామపై వ్యోమనౌకను దింపడానికి రష్యా చేసిన ప్రయత్నం విఫలమైంది. మరో వైపు భారత్‌కు చెందిన విక్రమ్ ల్యాండర్ విజయంతంగా జాబిల్లిపై దిగింది. వ్లాదిమిర్ పుతిన్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూన్ -25 ల్యాండర్, సాంకేతిక సమస్యతో చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. అయితే అదే సమ యంలో భారత్ విజయవంతంగా తన లక్ష్యాన్ని చేరుకుంది. చంద్రయాన్ త్రీని విజయవంతం చేసింది.

స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ బాగా వెనుకబడి ఉండేది. అప్పట్లో అమెరికా, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగించేది. ఈ నేపథ్యంలో హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్‌ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. 1969లో ఇండియన్‌ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌ సంస్థ కాస్తా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ , ఇస్రోగా అవతరించింది. తొలిరోజుల్లో కేవలం ఉపగ్రహాలను తయారు చేయడా నికే ఇస్రో పరిమితమైంది. అయితే తయారు చేయడమే కాదు, వాటిని ఉపయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండా లని అంతరిక్ష పరిశోధకులు డిసైడ్ అయ్యారు.

      ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే శాటిలైట్ లాంచ్ వెహికిల్. ఇస్రో తయారుచేసిన తొలి పూర్తిస్థాయి ఉపగ్రహానికి ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టారు. భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19న అప్పటి సోనియట్ యూనియన్‌ నుంచి విజయవంతంగా ప్రయోగిం చారు. 1980ల తరువాత భారత అంతరిక్ష పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. శాటిలైట్ లాంచ్ వెహికిల్ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలుగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్…పీఎస్ఎల్వీ నిర్మాణాన్ని ఇస్రో చేపట్టింది. 1990వ దశకంలో పీఎస్‌ఎల్వీ రాక, భారత అంతరిక్షకార్యక్రమానికి మంచి ఊపు నిచ్చినట్లయింది. అనేక వైఫల్యాల తరువాత 1994లో చేసిన పీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతమైంది.అప్పటినుంచి భారత ఉపగ్రహాలకు పీఎస్‌ఎల్వీ స్థిరమైన వేదికగా నిలిచింది.

       అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాల అవసరాన్ని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే మారుతున్న ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు భారత్‌ కూడా ఎదగాలంటే అంతరిక్ష పరిశోథనలు చేపట్టక తప్పదంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానమే పరిష్కారమంటున్నారు అంతరిక్ష పరిశోధకులు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థది 54 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఇస్రో అనేక విజయాలను నమోదు చేసుకుంది. దీంతో పాటు దేశీయ అవసరాల కోసం అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఇండియన్ స్పేస్ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని అద్భుతాలు చేయడానికి సన్నద్ధం అవుతోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్