సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో 07-04-2026 నాడు లేఖ రూపంలో BRS చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదని చెప్పారు. అందువల్లే పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ జల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ట స్థాయికి తెలంగాణ చేరింది. ఏపీ 74% వినియోగిస్తే, తెలంగాణ 25% పరిమితమైంది. రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రమాదంలో పడేసింది. సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలతో సాగునీటి రంగానికి ముప్పు ఏర్పడింది. అందుకే రైతు డిస్కం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. కాళేశ్వరం, దేవాదుల నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలి. తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా జల హక్కులు కాపాడాలి… అని లేఖలో పేర్కొన్నారు హరీశ్‌రావు.


