తెనాలి: హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ(Balakrishna) వైసీపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న బాలయ్య నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫైర్ అయ్యారు. సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడంపై మండిపడ్డారు. నరసరావుపేటలో ఇటీవల జరిగిన ఓ వేడుకలో బాలయ్య సినిమా పాట వేశారనే కారణంతో స్థానిక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారనే వార్తలు వచ్చాయి. దీంతో భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ(Balakrishna).. ఎమ్మెల్యే పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఆగ్రహించారు. అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రం ఊరుకోనని.. తాను మూడో కన్ను తెరిచానంటే చూస్కోండి అని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయంగా తనపై పోరాడండి.. అంతేకాని సినిమాల జోలికి రావొద్దని హెచ్చరించారు.
Read Also: రాంచరణ్ కు మరో అరుదైన గౌరవం.. చెర్రీని సన్మానించనున్న ప్రధాని మోదీ
Follow us on: Youtube Instagram