హైదరాబాద్ బొల్లారం ప్రాంతంలో మహిళ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తన భార్యను హత్య చేశారని భర్త అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా దాడి జరిగిందని, తనపై కూడా కత్తితో దాడి చేశారని చెప్పాడు. మృతురాలు మీనా, భర్త అనిల్‌తో కలిసి బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనిల్ చెప్పిన వివరాల్లో పొంతన లేకపోవడం గమనించారు. అనుమానం రావడంతో అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భార్య మీనాను హత్య చేసింది భర్త అనిలేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్య అనంతరం దుండగులు దాడి చేసినట్లు నాటకం ఆడినట్లు దర్యాప్తులో బయటపడింది. భార్య గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతులు గత 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారని, ఇటీవల కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారని స్థానికులు చెబుతున్నారు. వారిద్దరి మధ్య పెద్దగా గొడవలు ఉన్నట్లు ఎవరూ చెప్పకపోవడంతో హత్యకు అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భర్త అనిల్ పోలీసుల అదుపులో ఉండగా, మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ బొల్లారం మహిళ హత్య కేసులో కీలక మలుపు.. భర్తే హత్య చేశాడని నిర్ధారణ
0
27
Latest Articles
ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్
ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై పార్టీ బీఎల్‌వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
- Advertisement -
- Advertisement -


