షారుఖ్ ప్లేస్‌లో హృతిక్ రోషన్..?

కోలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ గెస్ట్ రోల్ ను.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ తో చేయించాలి అనుకున్నారు. అంతా సెట్ అయ్యింది.. షారుఖ్.. జైలర్ 2లో నటించడం ఫిక్స్ అనుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. షారుఖ్ నో చెప్పారట. ఇప్పుడు మరో క్రేజీ బాలీవుడ్ స్టార్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. షారుఖ్ ఎందుకు నో చెప్పారు..? షారుఖ్ ప్లేస్ లో నటించే క్రేజీ స్టార్ ఎవరు..? అసలు జైలర్ 2 థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ సీక్వెల్ జైలర్ 2. ఈ మూవీలో ఒక పవర్‌ ఫుల్ గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ షారుఖ్ అని అనుకున్నారు. రజినీ సినిమాలో నటించడం అంటే.. ఎవరు కాదంటారు. షారుఖ్ కూడా ముందు ఎస్ అనే చెప్పారట. అయితే.. షారుఖ్ తాజా చిత్రం కింగ్ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల సెట్ కాలేదట. అందుకనే ఈ ఆఫర్‌ కు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ స్టార్ హృతిక్ రోషన్‌ను రంగంలోకి దించేందుకు చర్చలు జరుపుతున్నారట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మొదటి భాగంలో ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే జైలర్ 2 కథాంశం కొనసాగుతుందని సమాచారం. ఈ క్రేజీ సీక్వెల్‌లో రజనీకాంత్‌తో పాటు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్‌.జె. సూర్య, సూరజ్ వెంజారమూడు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతే కాకుండా పార్ట్-1లో తమ క్యామియోలతో థియేటర్లలో పూనకాలు తెప్పించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఈ సీక్వెల్‌లో తమ పాత్రలను రిపీట్ చేస్తున్నారు. ఈ మూవీని ఆగష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సెప్టెంబర్ 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

రజనీకాంత్.. తన తదుపరి చిత్రాల లైనప్‌తో ఎంతో బిజీగా ఉన్నారు. యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ పై తెర‌కెక్క‌నున్న తలైవర్ 173 ప్రాజెక్ట్‌లో ఆయన నటించనున్నారు. ఆతర్వాత రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న భారీ మల్టీస్టారర్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఓ వైపు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో చర్చలు.. మరోవైపు కమల్ హాసన్ తో సినిమా.. మొత్తానికి రజినీ లైనప్ మామూలుగా లేదుగా. మరి.. ఈ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్