హైదరాబాద్‌కు చెందిన మోడల్ భవిత మండవ మరో అరుదైన ఘనత సాధించింది. 26 ఏళ్ల ఈ మోడల్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ షానెల్ భారత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న భవిత… తాజాగా ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు సంపాదించింది. ఆసియా ఖండంలోని అత్యంత ప్రతిభావంతులైన యువ పారిశ్రామికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, పెట్టుబడిదారులను గుర్తించి ఫోర్బ్స్ ప్రతి సంవత్సరం ఈ జాబితాను విడుదల చేస్తుంది. తెలుగు కుటుంబంలో జన్మించిన భవిత మందవ హైదరాబాద్‌లోని JNTUలో ఆర్కిటెక్చర్ చదివింది. అనంతరం న్యూయార్క్ యూనివర్శిటీ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో అసిస్టివ్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్న సమయంలో ఆమె జీవితంలో అనూహ్య మలుపు తిరిగింది. బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్‌లో ఆమెను ఓ మోడలింగ్ ఏజెంట్ గమనించడం ద్వారా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
ఫోర్బ్స్ జాబితాలో తెలుగు యువతికి చోటు
0
26
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


