ప్రభాస్.. రెండు టార్గెట్లు ఫిక్స్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఒకటి కాదు.. రెండు సినిమాలు సెట్స్ పై ఉంటే.. మరో రెండు సినిమాలు పట్టాలెక్కేందుకు రెడీగా ఉంటున్నాయి. ఇలా గ్యాప్ లేకుండా.. టైమ్ వేస్ట్ కాకుండా.. సినిమాలు చేస్తున్న డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు రెండు టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నాడట. ఈ రెండు టార్గెట్లు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఇంతకీ.. ప్రభాస్ ఫిక్స్ చేసుకున్న ఆ రెండు టార్గెట్లు ఏంటి..?

డార్లింగ్ ప్రభాస్ మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా రాజాసాబ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి. ప్రభాస్ ఫౌజీ షూటింగ్ ని ఎప్పటి నుంచో చేస్తున్నారు. హను రాఘవపూడి స్పెషల్ కేర్ తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే.. షూటింగ్ చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని చెబుతున్నారు కానీ.. ఎప్పుడు పూర్తవుతుందో అఫీషియల్ గా చెప్పడం లేదు. ఇన్ సైడ్ టాక్ అయితే.. డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫౌజీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయాలని ప్రభాస్ గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం.. హను రాఘవపూడి ఎప్పుడు డేట్స్ అడిగితే.. అప్పుడు ఇస్తున్నాడట ప్రభాస్.

ఇక ప్రభాస్ సెకండ్ టార్గెట్ స్పిరిట్. ఈ మూవీని నెక్ట్స్ ఇయర్ లో మార్చి 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం కోసం చాన్నాళ్లు వెయిట్ చేసాడు. ఈమధ్య స్పిరిట్ సెట్స్ పైకి వచ్చింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ.. ఎట్టి పరిస్థితుల్లోనూ అదే తేదీకి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ప్రభాస్ తో పాటు ఇతర కీలక ఆర్టిస్టులు పాల్గొంటున్న షెడ్యూల్స్ క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. ఫౌజీ కోసం వచ్చే నెల చిన్న బ్రేక్ తీసుకోనున్నారు. ఫౌజీ, స్పిరిట్ టార్గెట్ మిస్ కాకుండా తన వంతుగా సహకారం అందించి.. దర్శకులకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారట డార్లింగ్ ప్రభాస్.

అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. కేవలం నాలుగు నెలల గ్యాప్ లో రెండు ప్రభాస్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తాయి. కల్కి 2 ఎలాగూ 2028 రిలీజ్ కాబట్టి దాని గురించి టెన్షన్ అక్కర్లేదు. ఆతర్వాతే సలార్ 2 ఉంటుంది. అయితే.. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి.. ప్రభాస్ అనుకున్నట్టుగా ఫౌజీ, స్పిరిట్ సినిమాలు డిసెంబర్, మార్చిలో రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

Latest Articles

సిద్దరామయ్య మాస్టర్ ప్లాన్?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకోవడం రాజకీయంగా ఒక సాధారణ పరిణామంలా కనిపించడం లేదు. గురువారం నాడు బెంగుళూరులో తన క్యాబినెట్ మంత్రులతో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్