కాకినాడ తునిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. జూన్ నెలకు చరిత్రలో ప్రత్యేకత ఉందని.. కూటమికి చెందిన మూడు పార్టీలు కలిసింది ఈ జూన్ నెలలోనే అని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలవద్దని జట్టుకట్టామన్నారు. పేద వాడి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరని చెప్పారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడటం లేదని అన్నారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని తెలిపారు. మహిళా ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేస్తామని వివరించారు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగినా పేదలకు 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించామన్నారు. విశాఖ రైల్వే జోన్ కల కూడా సాకారమైందని చంద్రబాబు చెప్పారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు
0
4
Previous article
Latest Articles
తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి- పొన్నం ప్రభాకర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాకే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల...
- Advertisement -
- Advertisement -


