కోలీవుడ్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతుంది. విజయ్, జూనియర్ విజయ్ ఒక నెల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్, జూనియర్ విజయ్.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా..? అది కూడా నెల గ్యాప్ లో.. రాబోతున్నారా..? అసలు జూనియర్ విజయ్ కి విజయ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందా..? ఇంతకీ.. జూనియర్ విజయ్ ఏ సినిమాతో రాబోతున్నాడు..? అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. టెన్షన్లో విజయ్ ఫ్యాన్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఏమైంది..?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జన నాయగన్ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. సెన్సార్ సర్టిఫికెట్ రాగానే జూన్ 19 డేట్ వేసేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నట్టు కోలీవుడ్లో టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరుకు ఏదీ ఖరారుగా చెప్పలేరు కాబట్టి దాని కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జూనియర్ విజయ్ సినిమా ఏంటంటే.. దర్శకుడిగా మారి తొలిసారి తెరకెక్కించిన సినిమా సిగ్మా. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించడం విశేషం. ఈ సినిమాని జులై 31న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
దీంతో తండ్రీకొడుకులు తమ సినిమాలతో ఒక నెల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం ఆసక్తిగా మారింది. సిగ్మా సినిమాలో
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. ఇక్కడ విశేషం ఏంటంటే విజయ్ సిఎం ప్రమాణ స్వీకారానికి భార్య పిల్లలు రాలేదు. జేసన్ సంజయ్ కూడా కనిపించలేదు. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. విభేదాలతో పాటు త్రిష గురించి జరుగుతున్న ప్రచారం వల్లే దూరంగా ఉన్నారని మాట్లాడుకున్నారు.
దీంతో సిగ్మా టైంలో విజయ్ ఫ్యాన్స్.. జూనియర్ విజయ్ కు మద్దతుగా ఉంటారా..? ఉండరా..? అనేది ఆసక్తిగా మారింది. సిగ్మాని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. థమన్ సంగీతం సమకూర్చారు. వచ్చే నెల నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నారు. అయితే.. ఈ సినిమాకి సపోర్ట్ చేయాలా..? చేయకూడదా..? అనేది తేల్చుకోలేక ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. మరి.. ఏం జరగనుందో చూడాలి.


