అమెరికాలో హెలికాప్టర్‌ ప్రమాదంలో భారతీయ సంతతి యువకుడు మృతి.. పెళ్లైన కొన్ని గంటలకే

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారతీయ మూలాలున్న ఓ యువకుడు వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే దుర్మరణం చెందాడు. కేరళకు చెందిన కుటుంబ నేపథ్యం కలిగిన 26 ఏళ్ల డేవ్ ఫిజీ, డెల్టా ఎయిర్ లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నాడు. వివాహం అనంతరం తన భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్తుండగా, వారిని తీసుకెళ్తున్న రాబిన్సన్ R66 హెలికాప్టర్ జార్జియాలోని డాసన్‌విల్లేలో ఉన్న వారి వివాహ వేదిక సమీపంలో కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌ను నడుపుతున్న పైలట్ కూడా మరణించినట్లు అట్లాంటా న్యూస్ ఫస్ట్ నివేదించింది. అయితే, అధికారులు ఇప్పటివరకు అతని పేరును వెల్లడించలేదు. డేవ్ ఫిజీ భార్య జెస్నీ, వృత్తిరీత్యా నర్స్. ఆమె ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం అట్లాంటా నగరంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు సమాచారం.

Latest Articles

కమర్షియల్ సిలిండర్లపై మరోసారి బాదుడు

దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత పెరిగింది. ఇవాళ్టి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్