రాయదుర్గంలో టీజీఐఐసీ వేలం పాటలో ఎకరం భూమి ధర భారీగా పలికింది. TGIIC వేలంలో ఎకరం భూమి ధర రూ.204 కోట్లు పలికింది. 5 ఎకరాల 9 గుంటల భూమిని వేలం వేశారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన వేలంలో..రికార్డు స్థాయిలో ఎకరానికి రూ.237 కోట్లు పలికింది. ఇవాళ 5.9 ఎకరాలకు వేలం నిర్వహించగా .. రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. రెండు విడతల్లో కలిపి TGIICకి రూ.2500 కోట్ల ఆదాయం వచ్చింది.


