ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది జనసేన పార్టీ. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు సభ ఉంటుందని పార్టీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు. 2 వేల మంది సభలో పాల్గొంటారని చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు రిప్లై ఇచ్చారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరిగే సభకు నిరసనలు, ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సభకు అనుమతి నిరాకరించారు శేరిలింగంపల్లి జోన్ డీసీపీ.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్
0
47
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


