మండుటెండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. కేరళలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులోనూ కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. వారం రోజుల్లో తెలంగాణలోకి
0
28
Next article
Latest Articles
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి బ్రేక్
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి బ్రేక్ పడింది. భవన నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో 5 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటీవల భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పిటిషన్లపై విచారించిన...
- Advertisement -
- Advertisement -


