24.2 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

బాత్రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. వీడియోలు బయటకు వెళ్తే..!

మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ ఘటనపై మహిళా కమిషన్ దర్యాప్తు చేస్తోంది. అమ్మాయిల హాస్టల్ లో అగంతకులు వీడియోలు తీసారని ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. హాస్టల్‌ వార్డెన్‌ సహ కిచెన్‌లో పనిచేసే ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇది వారిపనేనని పోలీసులు భావిస్తున్నారు. 9 మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫింగర్‌ ప్రింట్లను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు వీడియోలు బయటకు వెళ్తే తమ పిల్లల పరిస్థితి ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాత్రూమ్‌లో వీడియో ఘటనతో కాలేజ్‌ యాజమాన్యం 3 రోజుల పాలు సెలవులు ప్రకటించింది.

అసలేం జరిగిందంటే..?
చదువు కోసం కన్నవాళ్లను విడిచి… దూరంగా హాస్టల్‌లో ఉంటూ విద్యానభ్యసిస్తున్న విద్యార్థినిలకు సీక్రెట్ కెమెరాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట కాలేజీ హాస్టల్ గదులు, వాష్ రూంలలో సీసీ కెమెరాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి కాలేజీలో ఈ తరహా దారుణమే వెలుగు చూసింది. హాస్టల్ బాత్రూంలో విద్యార్థినులు స్నానం చేస్తుండగా సీక్రెట్‌గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. దీంతో విద్యార్థినులను చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.

హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీసారంటూ… మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది స్నానాల గదిలో వీడియోలు తీశారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థినీలకు విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి. విద్యార్థినుల అసభ్యకరమైన వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని హాస్టల్ బయట బైఠాయించారు. అర్ధరాత్రి వరకు విద్యార్థుల ఆందోళన కొనసాగింది.

3 నెలలుగా వీడియో రికార్డింగ్‌లు జరుగుతున్నప్పటికి దానిని బయటకు రాకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. కాలేజీ హాస్టల్ లో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో కొందరు బాత్రూంలో విద్యార్థుల వీడియో తీశారని యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని చెప్తే విద్యార్థులను చులకన చేసి అసభ్యంగా మాట్లాడాలని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ABVP ధర్నా చేపట్టింది. విద్యార్థినిలను బ్లాక్ మెయిల్‌కి గురి చేస్తున్న సీఎంఆర్ కళాశాలని సీజ్ చేసి విద్యార్థినులను రక్షించాలని డిమాండ్.

విద్యార్థినిలు మొన్న అర్ధరాత్రి దాటేవరకు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను కాలేజీలోకి అనుమతించకపోవడంతో వారు గేటు బయట ధర్నాకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది గదిపై ఆందోళనకారులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు హాస్టల్ నిర్వాహలతో చర్చలు జరిపారు. అక్కడ పనిచేసిన సిబ్బంది వద్ద ఉన్న 12 మొబైల్ ఫోన్లు, ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest Articles

ఫార్ములా-ఈ కారు రేసు కేసు – విచారణ ఎదుర్కొన్న కారు పార్టీ చిన్న సారు..!

రాజకీయాల్లో ఎన్నో పక్షాలు ఉన్నా.. పాలకపక్షం, ప్రతిపక్షం నడుమ వైరం నిత్యకృత్యం అయ్యింది. సహజంగానే జరుగుతుందో, అసహజంగానే జరుగుతుందో కాని... రాజకీయ పార్టీ అధికార పార్టీగా మారిందంటే చాలు...ప్రతిపక్ష పార్టీ నేతల తప్పుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్