కోపం వస్తే ఏ మాత్రం వెనుకా ముందూ చూడరు. ల.. కారాలతో విరుచుకుపడతారు. మరోసారి ఆయన అదే చేశారు. దీనంతటికీ కారణం డిసెంబర్ 31 ఈవెంట్. ఈవెంట్‌కు వెళ్లొద్దంటూ మాధవీలత, యామినీ పిలుపునివ్వడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీనిపై గొడవ పీక్స్ వరకు చేరింది. కేసుల వరకు వెళ్లింది. ప్రస్తుతం మాధవీలత వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా మారింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ పార్క్ ఈవెంట్‌పై హైవోల్టేజ్ వార్ కొనసాగుతోంది. మాధవీలతపై తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు కూడా కంప్లైంట్ చేశారు. జేసీ పార్క్ ఈవెంట్‌లో తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు.
బీజేపీ ఫైర్ బ్రాండ్లు మాధవి లత, సాధినేని యామిని. వీరిద్దరూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై చేసిన కామెంట్లే ఇప్పుడు రచ్చ సృష్టిస్తున్నాయి. 31 రాత్రి జేసీ పార్క్‌లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ ఈవెంట్‌కు వెళ్లొద్దంటూ పిలుపునిచ్చారు మాధవీలత, సాధినేని యామినీ. ఆ ఏరియాలో కొందరు గంజాయి తాగుతారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. తాడిపత్రి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరిపై బూతులతో విరుచుకుపడ్డారు. మాధవీలత కారెక్టర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక సాదినేని యామినిని సైతం వదిలపెట్టలేదు. ఆమెపై కూడా హాట్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అమ్మాయిలా మా మీద కామెంట్లు చేసేది అంటూ విరుచుకుపడ్డారు. మంచి అమ్మాయిలను పెట్టుకోవాలంటూ బీజేపీ సూచించారు.
తాడిపత్రిలో డిసెంబర్ 31 వేడుకులను నిర్వహిస్తే తప్పేంటని బీజేపీ నేతలప్తె జేసీ తీవ్ర ఆరోపణలు చేశారు. హీరోయిన్ మాధవి లత, సాధినేని యామినిలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవి లత ప్రాస్టిట్యూట్ అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు.. మాధవి లతని ఎందుకు పెట్టుకున్నారో తెలియదని.. ఆమె పెద్ద వేస్ట్ వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. సాధినేని యామిని అవసరాల కోసం పార్టీలు మారుతుందన్నారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.