బుడమేరు వరద నియంత్రణపై విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్‌లో మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ సమీక్ష నిర్వహించారు. దీనికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, మున్సిపల్ శాఖ సెక్రటరీ కన్నబాబు, సీఆర్డీఏ కమీషనర్ కాటమనేని భాస్కర్, ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వరావు, ఇరిగేషన్ , మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, సర్వే అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమగ్ర నివేదిక అందించేలా ఆయా శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. గతంలో వారు చేసిన తప్పులు పునరావృత్తం కాకుండా , ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు ఇప్పటికే నాలుగుసార్లు సమీక్షలు చేసి భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.