క్రీడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ప్రారంభానికి సిద్దమైంది. మెక్సీకో వేదికగా నేడు ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఉత్తర అమెరికా దేశాలైన అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నికి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీలో తొలిసారి 48 జట్లు పోటీపడుతున్నాయి. దీంతో టైటిల్ ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఈ ఫీఫా వరల్డ్ కప్ మొత్తం 16 నగరాల్లో 104 మ్యాచ్‌లు నేటి నుంచి జులై 19 వరకు జరుగుతాయి.
ఇక ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలను మూడు దేశాల సంస్కృతులను ప్రదర్శించేలా అత్యంత వైభవంగా జరగనున్నాయి. మెక్సికో సిటీ స్టేడియం వేదికగా నేడు తొలి ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. అనంతరం మెక్సీకో, సౌతాఫ్రికా జట్ల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం అవుతుంది.


