టాలీవుడ్ కింగ్ నాగార్జున.. కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా… సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. ఇంకా చెప్పాలంటే.. అంతకు మించి అనేలా ఈ క్రేజీ మూవీ ఉండేలా పక్కా ప్లాన్ తో రూపొందిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు ప్లాన్ మారిందని.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. మారిన ప్లాన్ ఏంటి..? ఈ క్రేజీ మూవీ అప్ డేట్ ఇచ్చేది ఎప్పుడు..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున..100వ సినిమా చేస్తున్నప్పటికీ.. త్వరలో సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా.. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 15న సోగ్గాళ్లు వస్తున్నారు అంటూ షూటింగ్ స్టార్ట్ చేయకుండానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇందులో నాగార్జున ఒక్కరే కాకుండా నాగచైతన్య, అఖిల్ కూడా నటిస్తారని ప్రచారం జోరుగా జరిగింది. అయితే.. ఈ సినిమా ఇప్పటి వరుకు సెట్స్ కి వెళ్లడం కాదు కదా కనీసం ఓపెనింగ్ కూడా జరుపుకోలేదు. నాగ్ 100వ సినిమాని దసరాకి రిలీజ్ చేసి.. నాగ్ 101వ సినిమా సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అసలు ప్లాన్.
అయితే.. ఇప్పుడు నాగ్ ప్లాన్ మారిందని.. ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం రా కార్తీక్ దర్శకత్వంలో తన వందో సినిమా చేస్తున్న నాగార్జున ఇప్పుడు సోగ్గాడే సీక్వెల్ స్థానంలో కింగ్ 100 సినిమాని సంక్రాంతి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఈ క్రేజీ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది క్రైమ్ అండ్ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. ఇందులో చాలా గ్యాప్ తర్వాత టబు నాగ్ మూవీలో నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం.
ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరుకు జైలర్ 2, ది ప్యారడైజ్, విశ్వంభర, స్వయంభు, సంబరాల ఏటిగట్టు.. ఇలా పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలతో పోటీపడడం కంటే.. సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని నాగ్ ఫిక్స్ అయ్యారట. సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు వస్తారు. పైగా సంక్రాంతికి రిలీజ్ చేసిన నాగ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకనే.. సెంటిమెంట్ కూడా కలిసొస్తుందనే ఉద్దేశ్యంతో నాగ్ ప్లాన్ మార్చి 100వ సినిమాను దసరాకి కాకుండా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని సమాచారం. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై నాగ్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


