హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి బేగంపేట్ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ రైల్వే స్టేషన్‌ను కేంద్రం అభివృద్ధి చేసింది. రూ. 38 కోట్లతో రీ డెవలప్ చేసిన బేగంపేట్ రైల్వేస్టేషన్ ను గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంబించారు. అయినా చిన్నపాటి వర్షానికే ఇలా రైల్వేస్టేషన్‌లో నీరు చేరడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకకుండా చూడాలని కోరుతున్నారు. బేగంపేట్ రైల్వేస్టేషన్‌లో వర్షం నీరు చేరడంపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పందించారు. సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బేగంపేట్ రైల్వేస్టేషన్‌లోకి వర్షం నీరు
0
62
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


