స్వతంత్ర, వెబ్ డెస్క్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఏపీ మనిషిని వ్యాఖ్యానించిన రేవంత్.. తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికని అన్నారు. షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఉరుకుంటామా? అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరు. షర్మిల ఏపీ కాంగ్రెస్ కి పనిచేస్తే స్వాగతిస్తానని… షర్మిల ఏపీసీసీ చీఫ్ అయితే సహచర పీసీసీ చీఫ్ గా ఆమెని కలుస్తానని అన్నారు. నేను పీసీసీ చీఫ్ గా ఉన్నన్ని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదన్నారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించ పరచడమే అవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
షర్మిల కాంగ్రెస్ చేరికపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
0
335
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


