త్వరలో గద్వాలలో వైద్య కళాశాల.. ప్రకటించిన సీఎం కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. గద్వాలలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంను సీఎం ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. నూతన భవనంలో పూజలు నిర్వహించిన అనంతరం.. పీజేపీ క్యాంపు స్థలంలో కొత్తగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయం, నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ నెం.1 స్థానంలో ఉందని అన్నారు. తలసరి ఆదాయంలో.. అలాగే తాగునీటి సరఫరా విషయంలో మొదటి స్థానంలో ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఉద్యమ సమయంలో గద్వాల ప్రజల అవస్థలు చూసి చాలా బాధపడ్డానని వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ బాధను తొలగించుకొని సమస్యలన్నింటిని ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని అన్నారు. గట్టు ఎత్తిపోతల పూర్తయితే.. గద్వాల బంగారు తునకలా మారుతుందని సీఎం అభిప్రాయ పడ్డారు. త్వరలో గద్వాలలో వైద్య కళాశాల కూడా రాబోతుందని చెప్పారు. ముందుముందు అనేక అద్భుతాలు జరుగుతాయని తెలిపారు. ఐటీ రంగంలో రూ.2.47 లక్షల కోట్లకు చేరుకున్నామని కేసీఆర్ వివరించారు. త్వరలో గద్వాలలో వైద్య కళాశాల కూడా రాబోతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. జిల్లాలో ముందుముందు అనేక అద్భుతాలు జరుగుతాయన్న సీఎం.. ఐటీ రంగంలో రూ.2.47 లక్షల కోట్లకు చేరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్​గౌడ్, నిరంజన్​రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్