స్వతంత్ర, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణం జరిగింది. మాచవరం రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మూగ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాధిత మహిళ నిందితుల చెర నుంచి తప్పించుకొని సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి వెళ్లింది. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది యువతిని రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధిత మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చారు. నిందితుల్లో ఒకరు ఆటో డ్రైవర్ కాగా.. మరో ఇద్దరు గూర్ఖాలుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కందుకూరులో దారుణం.. మూగ మహిళపై అత్యాచారయత్నం
0
360
Previous article
Latest Articles
టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసిందా?… నారా లోకేశ్ శకం మొదలయ్యిందా?
ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా...
- Advertisement -
- Advertisement -


