అమీర్‌పేట్‌లోని అగ్ని ప్రమాద ఘటనపై రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు

అమీర్‌పేట్‌లోని మైత్రీవనం సమీపంలోని అగ్నిప్రమాద స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక విధివిధానాలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా రంగనాథ్‌ తెలిపారు. పాత విద్యుత్ వైరింగ్, అధిక విద్యుత్ వినియోగం వల్ల షార్ట్ సర్క్యూట్లు జరిగి అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.
అమీర్‌పేట ఘటనకు మెస్ చిమ్నీ నుంచి వచ్చిన నిప్పురవ్వలే కారణమా? లేక షార్ట్ సర్క్యూటా? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని ఆయన తెలిపారు. నగరంలోని అనేక భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లకు ఫైర్ NOCలు లేవని పేర్కొన్నారు. తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరద కాలువలపై ఉన్న నిర్మాణాల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్నిప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్