అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే.. దేవర సినిమా సక్సెస్ అయ్యింది కానీ.. ఆశించిన స్థాయిలో జాన్వీకి పేరు రాలేదు. ఇక పెద్ది సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఈ మూవీ కూడా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది కానీ.. జాన్వీకి పేరు రాలేదు. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ కు రెస్పాండ్ అవ్వడంతో జాన్వీకి కోపం వచ్చిందనే విషయం బయటపడింది. ఇంతకీ.. ఏమని పోస్ట్ పెట్టారు..? జాన్వీ ఎలా రియాక్ట్ అయ్యింది..?
పెద్ది సినిమాకి సంబంధించి రివ్యూను ఓ నెటిజన్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అందులో.. జాన్వీ పాత్రకు సరైన ప్రాధాన్యత దక్కలేదని రాసారు. అంతే కాకుండా.. భారతీయ సినీ చరిత్రలో ఒక కథానాయికకి జరిగిన అత్యంత అవమానం అని హెడ్డింగ్ పెట్టారు. దీనిని జాన్వీ కపూర్ లైక్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. జాన్వీ లైక్ చేయడంతో.. ఆమె కూడా తన పాత్రకు సరైన ప్రాధాన్యత దక్కలేదని ఫీలైనందని.. అందుకనే ఆ పోస్ట్ కు లైక్ చేసిందని కొందరు అంటుంటే.. మరి కొందరు పొరపాటు లైక్ కొట్టి ఉంటుందని కామెంట్లు పెట్టారు. ఇలా వార్తలు రావడంతో జాన్వీ ఆతర్వాత ఆ పోస్ట్ ను అన్ లైక్ చేశారు. అయితే.. అప్పటికే జాన్వీ లైక్ చేసిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.
పెద్ది సినిమాలో జాన్వీ పాత్ర గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఆమె క్యారెక్టర్ ని డైరెక్టర్ బుచ్చిబాబు డిజైన్ చేసిన తీరు మీద పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. రెండు పాటల్లో డ్యాన్స్ చేసి గ్లామర్ షో చేయడానికి తప్పా పెద్దగా ఆమెలోని నటిని బయటకు తీసేలా పాత్రను డిజైన్ చేయలేదు అంటున్నారు నెటిజన్లు. దేవర సినిమాలోనూ అంతే.. పాటలకే పరిమితం అయ్యింది కానీ.. పర్ ఫార్మెన్స్ కు స్కోప్ దక్కలేదు. ఇప్పుడు పెద్దిలోనూ జాన్వీకి అలాగే జరిగింది.
జాన్వీ కపూర్ పెద్ది.. పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో అన్ని ఈవెంట్లకు హాజరైంది.. ఇంటర్వ్యూలు ఇచ్చింది కానీ.. రావాల్సిన పేరు రాలేదు. ఇంతకీ ఎందుకు ఇలా జరిగిందంటే.. కొన్ని సీన్లు లెన్త్ వల్ల తగ్గించాల్సి వచ్చిందట. అందుకే.. సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ముందు వరకు తనకు కనిపించే ఆస్కారం దొరకలేదు. సి సెంటర్స్ లో తన ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బుచ్చిబాబు ఉద్దేశం అదే. అయితే.. ఆమెకు పేరు రాకపోయినా.. నటించిన రెండు సినిమాలు దేవర, పెద్ది సక్సెస్ అవ్వడంతో లక్కీ హీరోయిన్ అనే పేరు మాత్రం వస్తుంది. మరి.. లక్కీ హీరోయిన్ గా జాన్వీ ఎలాంటి ఆఫర్స్ దక్కించుకుంటుందో చూడాలి.


